మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ!

05-07-2022 Tue 10:38 | Entertainment
  • 'పుష్ప' హిట్ తో పాన్ ఇండియా స్టార్ గా బన్నీ 
  • సెట్స్ పైకి వెళ్లనున్న 'పుష్ప 2'
  • ఆ తరువాత సినిమా బోయపాటితో 
  • లైన్లోనే ఉన్న త్రివిక్రమ్   
Allu Arjun in  Trivikram movie
అల్లు అర్జున్ తన కెరియర్ గ్రాఫ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. తన సినిమాల కథల విషయంలోను .. పాత్రల విషయంలోను కొత్తదనం ఉండేలా ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన దృష్టి పెడుతుంటాడు. 'పుష్ప' సినిమా ఆయనకి పాన్ ఇండియా ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. దాంతో ఇప్పుడు ఆయన ఆ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడు.

ఆ తరువాత బన్నీ ఏ దర్శకులతో సినిమాలు చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. తాజా ఇంటర్వ్యూలో ఆ విషయాలను గురించి బన్నీ వాసు మాట్లాడాడు. 'పుష్ప 2' తరువాత బోయపాటితో బన్నీ సినిమా ఉండనుంది. ఆ తరువాత సినిమా త్రివిక్రమ్ తో ఉంటుంది. మహేశ్ తో సినిమా తరువాత బన్నీతోనే త్రివిక్రమ్ చేసే ఛాన్స్ ఉంది. 

ఆ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను తాను త్రివిక్రమ్ తో మాట్లాడటం కూడా జరిగిపోయిందని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేసిన 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'అల వైకుంఠపురములో' సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఈ కాంబో మళ్లీ కలవబోతుందన్న మాట.