N95 Mask: ఈ మాస్కుతో కరోనా వైరస్ ఖతం!

  • ఎన్ 95 మాస్క్‌ ఫిల్టర్లకు అమోనియం పాలీమర్ల గ్రాఫ్టింగ్
  • తమ మీద పడిన వైరస్‌ను వెంటనే చంపేసేలా మాస్క్ అభివృద్ధి
  • రెన్‌సెలీర్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల ఘనత
Researchers develop new N95 face mask that can kill Covid virus

కరోనా వైరస్ భయాలకు ఇక కళ్లెం పడినట్టే. వైరస్‌ను ఖతం చేసే సరికొత్త ఎన్ 95 మాస్కును అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వైరస్ వ్యాప్తిని ఇది తగ్గించడమే కాకుండా ఎక్కువ కాలం వాడొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణ ఎన్95 మాస్కుల్లోని యాక్టివ్ ఫిల్టరేషన్ పొరలు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి అవి త్వరగా రసాయన మార్పుల ప్రభావానికి గురవుతాయి. దీనివల్ల వడపోత సామర్థ్యం తగ్గడంతో వైరస్‌ను పూర్తి స్థాయిలో అడ్డుకోలేవు. ఒకవేళ ఈ మాస్కుల్లోని పోగుల కూర్పును కనుక మారిస్తే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. 

ఈ నేపథ్యంలో రెన్‌సెలీర్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు సరికొత్తగా ఆలోచించారు. ఎన్‌95 మాస్కుల్లో వాడే పాలీప్రొపలీన్ ఫిల్టర్లలోకి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీ మైక్రోబియల్ పాలీమర్లను విజయవంతంగా జోడించారు. అతినీలలోహిత కిరణాల సాయంతో వీటిని గ్రాఫ్టింగ్ చేశారు. యాంటీ బ్యాక్టీరియల్ సామర్థ్యం కలిగిన ఈ అమోనియం పాలీమర్లు తమమీద పడిన వైరస్‌ను చంపేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

More Telugu News