Narendra Modi: కేసీఆర్!.. జగన్‌ను చూసి నేర్చుకోండి: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Union minister Dharmendra pradhan slams KCR
  • సీఎంలందరూ ప్రధానిని గౌరవించాలన్న కేంద్రమంత్రి
  • మోదీని ప్రజలు రెండుసార్లు ప్రధానిగా ఎన్నుకున్నారని గుర్తు చేసిన ధర్మేంద్ర ప్రధాన్
  • జగన్‌లానే సీఎంలందరూ మోదీని గౌరవించాలని సూచన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రిని గౌరవించడమెలాగో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి నేర్చుకోవాలని సూచించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోకూడదన్నారు. మోదీని ఈ దేశ ప్రజలు రెండుసార్లు ప్రధానిని చేశారన్నారు. 

ఏపీకి వచ్చిన ప్రధానికి జగన్ ఎలాగైతే స్వాగతం పలికారో.. ఏ ముఖ్యమంత్రి అయినా అలాగే ప్రధానికి గౌరవం ఇవ్వాలని అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానిని ఆహ్వానించేందుకు కేసీఆర్ వెళ్లకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News