Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాల హత్యకేసు: షార్ప్ షూటర్ అంకిత్ శిర్సా అరెస్ట్

Sidhu Moose Wala murder case Shooter and his accomplice arrested
  • మే 29న సిద్ధూ మూసేవాల హత్య
  • సిర్సా, షూటర్లకు ఆశ్రయమిచ్చిన సచిన్ భివానీ అరెస్ట్
  • పిస్టల్, లైవ్ కార్టరిడ్జ్‌లు, తుపాకి స్వాధీనం
సంచలనం సృష్టించిన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాల హత్య కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు. తప్పించుకు తిరుగుతున్న షార్ప్ షూటర్ అంకిత్ శిర్సా (19) నిన్న ఢిల్లీలోని కశ్మీర్ గేట్ బస్టాండ్ వద్ద పోలీసులకు చిక్కాడు. అతడితోపాటు మరికొందరు షూటర్లకు ఆశ్రయం ఇచ్చిన సచిన్ భివానీ (25) అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మే 29న సిద్ధూపై కాల్పులు జరిపిన నలుగురిలో అంకిత్ కూడా ఒకడు. సోనిపట్‌కు చెందిన అతడిపై రాజస్థాన్‌లో ఇప్పటికే రెండు హత్యాయత్నం కేసులున్నాయి. నిందితుల నుంచి ఒక 9 ఎంఎం బోర్ పిస్టల్, 10 లైవ్ కార్టరిడ్జ్‌లు, 0.30 తుపాకి, పంజాబ్ పోలీసుల యూనిఫామ్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక సిమ్ కార్డు, ఒక డాంగిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Sidhu Moose Wala
Panjab
Singer
Ankit Sirsa
Sachin Bhiwani

More Telugu News