మీడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పవిత్రా లోకేశ్

04-07-2022 Mon 21:58 | Both States
  • మీడియాలో నరేశ్, పవిత్రా లోకేశ్ లపై కథనాలు
  • ఓ హోటల్ గదిలో ఇరువురు... దాడికి యత్నించిన రమ్య
  • మీడియాలో ప్రముఖంగా ప్రసారం
  • రిపోర్టర్లు తనను వెంబడిస్తున్నారన్న పవిత్ర
  • కేసు నమోదు చేసుకున్న మైసూరు పోలీసులు
Pavitra Lokesh complains against media
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, క్యారెక్టర్ నటి పవిత్రా లోకేశ్ పై గత కొన్నిరోజులుగా మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరూ మైసూరులో ఓ హోటల్ గదిలో ఉండగా, పవిత్ర లోకేశ్ ను నరేశ్ భార్య రమ్య చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించడం తెలిసిందే. ఇది కూడా మీడియాలో ప్రముఖంగా ప్రసారమైంది. 

ఈ నేపథ్యంలో, పవిత్ర లోకేశ్ పోలీసులను ఆశ్రయించారు. తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగేలా మీడియాలో కథనాలు వస్తున్నాయని, కొందరు మీడియా ప్రతినిధులు తనను వెంబడిస్తున్నారంటూ మైసూరు వీవీపురం పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.