Mamata Banerjee: మమతా బెనర్జీ నివాసంలోకి దొంగచాటుగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తి... అరెస్ట్ చేసిన పోలీసులు

Man tries to sneak into Mamata Banerjee residence in Kolkata
  • కోల్ కతాలో ఘటన
  • మమతాకు జడ్ ప్లస్ సెక్యూరిటీ
  • భద్రతా వలయాన్ని ఛేదించిన వ్యక్తి
  • జులై 11 వరకు రిమాండ్
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి దొంగచాటుగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని హబీబుర్ రెహ్మాన్ (31)గా గుర్తించారు. నార్త్ 24 పరగణాల జిల్లా హస్నాబాద్ ప్రాంతంలోని నారాయణపూర్ కు చెందినవాడు. కాగా, దక్షిణ కోల్ కతాలోని మమతా బెనర్జీ అధికారిక నివాసం లోపలి పరిసరాల్లో అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని పట్టుకున్నారు. హబీబుర్ రెహ్మాన్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు జులై 11 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ రిమాండ్ విధించింది. 

రెహ్మాన్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడని, అయితే, అతడిపై బలప్రయోగం చేసి పట్టుకోవాల్సి వచ్చిందని పోలీసులు కోర్టుకు వివరించారు. సీఎం నివాసంలోకి ఎందుకు ప్రవేశించాలనుకున్నాడో, అతడిని ప్రశ్నించి తెలుసుకుంటామని తెలిపారు. సీఎం మమతా బెనర్జీకి జడ్ ప్లస్ భద్రత ఉంటుంది. అయినప్పటికీ ఓ వ్యక్తి భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఎలా వచ్చాడన్న దానిపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష చేపట్టారు.
Mamata Banerjee
Habibur Rehman
Sneak
Arrest
Police
Kolkata
West Bengal

More Telugu News