సత్యరాజ్ తనయుడిని సపోర్ట్ చేసిన ప్రభాస్!

  • హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో 'శిబి'
  • తాజా చిత్రంగా రానున్న 'మాయోన్'
  • ఈ నెల 7వ తేదీన సినిమా విడుదల 
  • గుడ్ లక్ చెప్పిన ప్రభాస్
Maayon movie update

కోలీవుడ్ తెరకి పరిచయమైన స్టార్ వారసులలో సత్యరాజ్ తనయుడు 'శిబి' ఒకరు. హీరోగా పరిచయమైన దగ్గర నుంచి నిలదొక్కుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడుగానీ, కాలం కలిసి రావడం లేదు. ఈ మధ్య కాలంలో తమిళ హీరోలంతా తమ సినిమాలు తెలుగులోను రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. 

'మాయోన్ ' సినిమాతో 'శిబి' కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నాడు. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులోను ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో తెలుగులోను ఈ సినిమా ప్రమోషన్స్ ను గట్టిగానే కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా చిన్నపాటి ఈవెంట్ కూడా చేశారు. 

'మిర్చి' సినిమా నుంచి సత్యరాజ్  - ప్రభాస్ ల మధ్య మంచి అనుబంధం ఉంది. 'బాహుబలి'తో మరింత బలపడింది. అందువల్లనే ప్రభాస్ ఇన్ స్టా ద్వారా 'శిబి'కి గుడ్ లక్ చెప్పడమే కాకుండా, ఈ నెల 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ ట్రైలర్ ను కూడా పోస్ట్ చేశాడు. ప్రభాస్ సపోర్ట్  శిబికి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.

More Telugu News