'బింబిసార' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

  • 'బింబిసార'గా కల్యాణ్ రామ్ 
  • టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికలుగా కేథరిన్,  సంయుక్త 
  • ఆగస్టు 5వ తేదీన సినిమా రిలీజ్
Bombisara Movie Update

హీరోగా .. నిర్మాతగా కల్యాణ్ రామ్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూనే, సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంతవరకూ సోషల్ మూవీస్ చేస్తూ వచ్చిన కల్యాణ్ రామ్, ఈసారి చరిత్రలో ముడిపడిన సైన్స్ ఫిక్షన్ ను ఎంచుకున్నాడు .. ఆ సినిమానే 'బింబిసార'. 
 
ఇది టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నడిచే కథ. సైన్స్ ను .. చరిత్రను కలుపుకుంటూ నడుస్తుంది. కథ ప్రకారం వర్తమానంలోనూ ... గతంలోను రెండు విభిన్నమైన పాత్రలలో కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు. 'బింబిసార'గా ఆయన లుక్ ఇప్పటికే బయటికి వచ్చింది. ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలడానికి రెడీ అవుతున్నారు. 

ఈ రోజు సాయంత్రం 5:09 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా  చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికలుగా  కేథరిన్ .. సంయుక్త మీనన్ కనిపించనున్నారు. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కల్యాణ్ రామ్ చేసిన ఈ ప్రయోగం ఎంతవరకూ ఫలిస్తుందనేది చూడాలి..

More Telugu News