Eknath Shinde: సీఎం పదవి కావాలని నేను డిమాండ్ చేయలేదు: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే

  • బీజేపీ వ్యక్తి సీఎం అవుతారని అందరూ భావించారన్న షిండే
  • కానీ బీజేపీ తనను సీఎం చేసిందని వ్యాఖ్య
  • థాకరే సంకీర్ణ ప్రభుత్వంపై శివసైనికులు అసంతృప్తిగా ఉన్నారన్న సీఎం
I never demanded for CM post says Eknath Shinde

అత్యంత నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ అండతో శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎం బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ, తనకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని ఎప్పుడూ డిమాండ్ చేయలేదని చెప్పారు. 

ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై శివసైనికులు అసంతృప్తిగా ఉన్నారని షిండే అన్నారు. ఎమ్మెల్యేలు కూడా అప్సెట్ అయ్యారని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలోని అంతర్గత సమస్యల వల్ల రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. 

తాము అధికారంలోకి రావడానికి బీజేపీ సహకరించిందని అందరూ అనుకుంటున్నారని షిండే చెప్పారు. 115 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటుందని అందరూ భావించారని... అయినప్పటికీ, కేవలం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్న తమకు సీఎం పదవిని బీజేపీ ఆఫర్ చేసిందని తెలిపారు. 

దేవేంద్ర ఫడ్నవిస్ కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వడంపై షిండే స్పందిస్తూ... తాను కూడా ఈ విషయం గురించి ఫడ్నవిస్ తో మాట్లాడానని... బీజేపీ హైకమాండ్ ఆదేశాలను తాను ఆచరిస్తానని ఆయన తనతో అన్నారని చెప్పారు. సామాన్య కార్యకర్త అయిన తనను తమ పార్టీ సీఎంను చేసిందని ఆయన చెప్పారని తెలిపారు.

More Telugu News