Bjp: బీజేపీ సభకు భారీగా జనం.. పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటున్న నేతలు

Huge crowd for BJP rally Leaders reaching parade ground
  • ఇంకా కొనసాగుతున్న కార్యకర్తలు, అభిమానుల రాక
  • సాయంత్రం ఐదున్నర తర్వాత సభాస్థలికి చేరుకోనున్న ప్రధాని మోదీ
  • గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ ‘విజయ సంకల్ప సభ’కు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు వచ్చారు. హెచ్ఐసీసీలో జాతీయ కార్యవర్గ భేటీ ముగియడంతో నేతలు ఒక్కొక్కరుగా పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన బీజేపీ నేతలు కూడా పరేడ్ గ్రౌండ్స్ కు వస్తున్నారు. ఇంకా పెద్ద సంఖ్యలో జనం తరలివస్తుండటంతో పరేడ్ గ్రౌండ్స్ తోపాటు చుట్టు పక్కల ప్రాంతాలు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బీజేపీ నినాదాలు వినిపిస్తున్నాయి.
సభా స్థలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
  • పబ్లిక్ ఎంట్రీ గేట్ల వద్ద నుంచి సాధారణ కార్యకర్తలు, జనాలను లోనికి అనుమతిస్తుండగా.. గేట్ నంబర్ 3 వద్ద నుంచి వీఐపీ పాస్ లు ఉన్నవారిని పంపిస్తున్నారు.
  • వివిధ జిల్లాల నుంచి వాహనాల్లో వస్తున్న వారు పరేడ్ గ్రౌండ్స్ చుట్టుపక్కల ప్రాంతాలు, హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేసి నడుచుకుంటూ సభా స్థలికి చేరుకుంటున్నారు.
  • సభకు వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు వేల సంఖ్యలో బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 
  • సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితర నేతలు సభా స్థలికి చేరుకునే అవకాశం ఉంది.
Bjp
Bjp Rally
Hyderabad
Telangana
Narendra Modi

More Telugu News