BJP: నన్ను కింద కూర్చొమ్మని ఫొటో తీశారు.. నోవాటెల్ లోకి రానివ్వలేదన్నది అబద్ధం: తెలంగాణ వంటల స్పెషలిస్టు యాదమ్మ

They took a picture of me sitting down It is a lie that I was not allowed to enter Novatel Says Telangana cooking specialist Yadamma
  • అప్పుడు వారి దురుద్దేశం నాకు అర్థం కాలేదు
  • అయినా కొందరు మూర్ఖులు దీనిపై ప్రచారం చేస్తున్నారని వెల్లడి
  • యాదమ్మ మాట్లాడిన వీడియోను ట్వీట్ చేసిన బీజేపీ తెలంగాణ విభాగం
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నోవాటెల్, హెచ్ఐసీసీ ప్రాంగణంలోకి తనను రానివ్వలేదంటూ వచ్చిన వార్తలను తెలంగాణ వంటల నిపుణురాలు యాదమ్మ ఖండించారు. నోవాటెల్ వద్దకు వెళ్లినప్పుడు కొందరు తనను కింద కూర్చొమ్మని చెప్పి ఫొటోలు తీశారని.. అప్పుడు వారి దురుద్దేశం ఏమిటో తనకు అర్థం కాలేదని ఆమె చెప్పారు. దీనిపై కొందరు మూర్ఖులు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియోను బీజేపీ తెలంగాణ విభాగం ట్విట్టర్ లో పోస్టు చేసింది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులకు తెలంగాణ వంటకాలను రుచి చూపించేందుకు రాష్ట్ర బీజేపీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆ వంటలను సిద్ధం చేసేందుకు కరీంనగర్ కు చెందిన నిపుణురాలు యాదమ్మకు బాధ్యత అప్పగించింది. ఆదివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా ఈ వంటలను రుచి చూశారు.
BJP
Bjp Meet
Hyderabad
Telangana
Yadamma

More Telugu News