Chandrababu: పోలీసుల తీరు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం.. ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

  • సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై వేధింపులు
  • రాజకీయ పరంగానే ఇబ్బంది పెడుతున్నారు
  • కుట్ర చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
The behavior of the police is against the verdict of the Supreme Court Chandrababu letter to AP DGP

వివిధ అంశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని పోలీసులు వేధిస్తున్నారని.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. పోస్టులు పెడుతున్నవారిపై సీఐడీ వేధింపులను ఖండించారు. దీనిపై ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డికి తాజాగా ఓ లేఖలో ఫిర్యాదు చేశారు.

అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారు
సీఐడీ అధికారులు గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని.. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి అదుపులోకి తీసుకోవడం ఏమిటని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని నోటీసుల పేరుతో వేధించడం సరికాదని.. ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వమే కావాలని ప్రతిక్షాలను రాజకీయంగా వేధిస్తోందని.. ఈ కుట్రకు సహకరిస్తున్న సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News