కంగ్రాచ్యులేషన్స్ హర్షిణి... జగన్ తనయను అభినందించిన విజయసాయి

02-07-2022 Sat 21:58
  • ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ నుంచి హర్షిణి డిస్టింక్షన్
  • సీఎం జగన్ పుత్రికోత్సాహం
  • ట్విట్టర్ లో స్పందించిన విజయసాయి
  • పిల్లల్లో విలువలు పెంపొందించారని వైఎస్ భారతికి అభినందనలు
Vijayasai appreciates CM Jagan daughter Harshini
సీఎం జగన్, వైఎస్ భారతిల పెద్ద కుమార్తె హర్షిణి రెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ విద్యా సంస్థ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. పుత్రికోత్సాహంతో సీఎం జగన్ దంపతులు పొంగిపోతున్నారు. కాగా, హర్షిణి మాస్టర్స్ డిగ్రీ అందుకోవడం పట్ల వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. 

"ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ నుంచి డిస్టింక్షన్ సాధించినందుకు హర్షిణికి శుభాభినందనలు. తమ కుమార్తె ఘనత పట్ల తల్లిదండ్రులుగా గర్విస్తున్న జగన్ సర్ కు, భారతమ్మకు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా, తమ పిల్లల్లో విద్యా ప్రాముఖ్యత, విలువలు, ఆత్మవిశ్వాసం, వినయవిధేయతలను పెంపొందించినందుకు భారతమ్మను అభినందిస్తున్నాను" అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.