అమెరికాలో క‌ల్వ‌కుంట్ల క‌విత‌... ఆటా మ‌హాస‌భ‌ల‌కు హాజ‌రుకానున్న ఎమ్మెల్సీ

02-07-2022 Sat 21:52
  • వాషింగ్ట‌న్ చేరుకున్న క‌విత‌
  • ఆటా మ‌హాస‌భ‌ల్లో తెలంగాణ పెవిలియ‌న్‌ను ప్రారంభించ‌నున్న ఎమ్మెల్సీ
  • బ‌తుక‌మ్మ ప్ర‌త్యేక సంచిక‌ను ఆవిష్క‌రించ‌నున్న వైనం
trs mlc kavitha reached Washingtonin america
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. అమెరికన్ తెలుగు అసోసియేష‌న్ (ఆటా) 17 మ‌హాస‌భ‌ల్లో పాలుపంచుకునే నిమిత్తం అమెరికా వెళ్లిన క‌విత‌... శ‌నివారం రాత్రి వాషింగ్ట‌న్ చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఆమెకు ఆటా ప్ర‌తినిధులతో పాటు ఇప్ప‌టికే అక్క‌డ‌కు చేరుకున్న టీఆర్ఎస్ నేత‌లు గువ్వ‌ల బాల‌రాజు, మ‌హేశ్ బిగాల‌లు స్వాగ‌తం ప‌లికారు. 

ఆటా మ‌హాస‌భ‌ల్లో భాగంగా ఆమె అక్క‌డ ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియ‌న్‌ను ప్రారంభించ‌నున్నారు. అంతేకాకుండా బ‌తుక‌మ్మ‌పై ప్ర‌చురించిన ప్ర‌త్యేక సంచిక‌ను కూడా క‌విత ఆవిష్క‌రించ‌నున్నారు. ఆటా మ‌హాస‌భ‌ల‌కు హాజ‌రు కావాలంటూ క‌విత‌కు ఇదివ‌ర‌కే ఆ సంస్థ ప్ర‌తినిధులు ఆహ్వానం పంపారు. వారి ఆహ్వానం మేర‌కు అమెరికా వెళుతున్న‌ట్లు గ‌త నెలలోనే క‌విత ప్ర‌క‌టించారు.