ఏర్పాట్లు ఆదుర్స్‌!... తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు మోదీ ప్ర‌శంస‌!

02-07-2022 Sat 21:36
  • హెచ్ఐసీసీ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు
  • శ‌నివారం రాత్రి ముగిసిన తొలిరోజు స‌మావేశాలు
  • మోదీ, అమిత్ షా, న‌డ్డాల‌తో సంజ‌య్‌, ల‌క్ష్మ‌ణ్‌ల భేటీ
modi appreciated telanagana bjpleaders over arrangements to party meeting
హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీ కేంద్రంగా జ‌రుగుతున్న బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో భాగంగా తొలి రోజు స‌మావేశాలు శ‌నివారం రాత్రి ముగిశాయి. తొలి రోజు స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, ఎంపీ కె.లక్ష్మ‌ణ్‌ల‌తో ప్ర‌ధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డాలు ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల కోసం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయంటూ మోదీ తెలంగాణ నేత‌ల‌ను అభినందించారు. స‌మావేశాల కోసం దేశం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన నేత‌ల‌ను ఆహ్వానించడం ద‌గ్గ‌ర నుంచి వారికి బ‌స‌, భోజ‌నం, ప్ర‌త్యేకించి స‌మావేశాల కోసం ఏర్పాటు చేసిన వేదిక‌లు అద్భుతంగా ఉన్నాయంటూ మోదీ పేర్కొన్నారు. అనంత‌రం పార్టీ తెలంగాణ శాఖ ప‌రిస్థితి, రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతంపై కీల‌క చ‌ర్చ జ‌రిగింది.