టీమిండియా, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

02-07-2022 Sat 20:59
  • బర్మింగ్ హామ్ లో టెస్టు
  • పలుమార్లు వర్షంతో అంతరాయం
  • ఇంగ్లండ్ స్కోరు 3 వికెట్లకు 60 పరుగులు
  • 3 వికెట్లు తీసిన బుమ్రా
  • తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 416కు ఆలౌట్
  • ఇంకా 356 రన్స్ వెనుకబడి ఉన్న ఇంగ్లండ్
Rain stops play in Birmingham test between Team India and England
బర్మింగ్ హామ్ లో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టుకు వరుణుడు పదేపదే అడ్డు తగులుతున్నాడు. ఇవాళ రెండో రోజు ఆట మరోసారి వాన కారణంగా నిలిచిపోయింది. అప్పటికి ఇంగ్లండ్ స్కోరు 15.1 ఓవర్లలో 3 వికెట్లకు 60 పరుగులు. ఇంగ్లండ్ కోల్పోయిన 3 వికెట్లూ టీమిండియా తాత్కాలిక సారథి బుమ్రా ఖాతాలోకి చేరాయి. 

టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లండ్ ఇంకా 356 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో జో రూట్ (19 బ్యాటింగ్), జానీ బెయిర్ స్టో (6 బ్యాటింగ్) ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌట్ కావడం తెలిసిందే.