బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

02-07-2022 Sat 20:34
  • ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదో వ‌న్డేలో బుమ్రా హిట్టింగ్‌
  • బ్రాడ్ ఓవ‌ర్‌లో 35 ప‌రుగులు రాబ‌ట్టిన వైనం
  • బుమ్రాను చూస్తుంటే యువీ గుర్తుకు వ‌చ్చాడన్న స‌చిన్‌
sachin tendulkar comments on bumra hitting
ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ బాధ్య‌త‌లు తీసుకున్న జస్‌ప్రీత్ బుమ్రా నిజంగానే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్ప‌టిదాకా బౌలింగ్‌లోనే స‌త్తా చాటిన బుమ్రా త‌న బ్యాటింగ్ ప‌వ‌రేమిటో ఇంగ్లండ్ బౌల‌ర్ల‌కు ప్ర‌త్యేకించి స్టువ‌ర్ట్ బ్రాడ్‌కు రుచి చూపించాడు. బ్రాడ్ వేసిన ఓవ‌ర్‌లో బుమ్రా ఏకంగా 35 ప‌రుగులు రాబ‌ట్టి స‌త్తా చాటాడు. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు కూడా ఉన్నాయి.

బుమ్రా బ్యాట్‌తో చెల‌రేగిన వైనంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుండ‌గా... తాజాగా మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూడా బుమ్రా హిట్టింగ్‌ను ఆకాశానికెత్తేశాడు. బుమ్రా హిట్టింగ్ చూస్తుంటే... అక్క‌డ ఆడుతున్న‌ది యువ‌రాజ్ సింగా?  లేక బుమ్రానా? అంటూ స‌చిన్ సోష‌ల్ మీడియాలో ఓ కామెంట్ పోస్ట్ చేశాడు. అంతేకాకుండా బుమ్రా హిట్టింగ్‌తో 2007లో బ్రాడ్ వేసిన ఓవ‌ర్‌లోనే వీర విహారం చేసిన యువ‌రాజ్ సింగ్ ఇన్నింగ్స్ గుర్తుకు వ‌చ్చిందంటూ వ్యాఖ్యానించాడు.