"ప‌క్కవ‌డ" పట్టుబ‌ట్టిన‌ రాహుల్ గాంధీ

02-07-2022 Sat 19:41
  • వ‌య‌నాడ్ ప‌ర్య‌ట‌న‌లో రాహుల్ గాంధీ
  • కొలియాడిలోని కాకా హోట‌ల్‌కు వెళ్లిన ఎంపీ
  • ప‌క్క‌వ‌డ‌, చ‌మంతి, కుట‌మ్ కులుక్కి ష‌ర్బ‌త్‌ ల‌ను రుచి చూసిన వైనం
  • రుచి అద్భుత‌మ‌ని, వ‌యనాడ్ వ‌స్తే మిస్ కావొద్ద‌ని వెల్ల‌డి
rahul gandhi tastes Pakkavada Chammanthi and a Kutam Kulukki Sarbath in wayanad
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ త‌న సొంత నియోజ‌కవ‌ర్గం వ‌య‌నాడ్‌లో ప‌ర్య‌టిస్తున్న సంత‌తి తెలిసిందే. శుక్ర‌వారం ఉద‌యం వ‌య‌నాడ్ చేరిన రాహుల్ శ‌నివారం కూడా అక్క‌డే గ‌డిపారు. ఈ సంద‌ర్భంగా వ‌య‌నాడ్ లోక‌ల్ స్నాక్స్ ప‌క్క‌వ‌డను రుచి చూశారు. వ‌య‌నాడ్ లోక‌ల్ ఫ్లేవ‌ర్‌తో చేసిన చ‌మంతి చ‌ట్నీతో ప‌క్క‌వ‌డ‌ను ఎంజాయ్ చేసిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. ఈ మేర‌కు పార్టీ నేత‌ల‌తో క‌లిసి ప‌క్క‌వ‌డ రుచి చూస్తున్న ఫొటోల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు.

వ‌య‌నాడ్ ప‌రిధిలోని కొలియాడికి వెళ్లిన రాహుల్ గాంధీ... ఆ ప్రాంతానికి చెందిన ఎన్ఎం ఫిరోజ్ కుటుంబం నిర్వ‌హిస్తున్న ఎస్ఎస్ కూల్ హౌజ్‌ను సంద‌ర్శించారు. అక్క‌డ వారు అందించిన ప‌క్క‌వ‌డ‌ను రుచి చూసిన రాహుల్‌... వారందించిన లోక‌ల్ ఫ్లేవ‌ర్ కుట‌మ్ కులుక్కి అనే ష‌ర్బ‌త్‌ను ఆస్వాదించారు. వీటి రుచి అదిరింద‌ని చెప్పిన రాహుల్.. వ‌యనాడ్ వ‌స్తే వీటిని రుచి చూడ‌టం మ‌ర‌వొద్ద‌ని కూడా ఆయ‌న పిలుపునిచ్చారు.