Anupam Kher: నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం... 'గౌరవం'గా ఏదో ఒకటి చేయండంటూ అనుపమ్ ఖేర్ సెటైర్!

Anupam Kher reacts SC remarks on Nupur Sharma
  • మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు
  • దేశవ్యాప్తంగా నిరసనజ్వాలలు
  • పలుచోట్ల దారుణాలు
  • అంతర్జాతీయంగానూ విమర్శలు
  • నుపుర్ ను ఏకిపారేసిన సుప్రీం
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వ్యాఖ్యలు చేయగా ఎంత దుమారం రేగిందో తెలిసిందే. నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు కూడా మండిపడింది. ఒంటిచేత్తో దేశాన్ని నిప్పుల కుంపటిలా మార్చేసిందంటూ సుప్రీం ధర్మాసనం నుపుర్ శర్మపై వ్యాఖ్యలు చేసింది. నుపుర్ లాంటి వ్యక్తులకు ఏ మతంపైనా గౌరవం లేదని విమర్శించింది. 

దీనిపై బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తీవ్రస్థాయిలో స్పందించారు. సోషల్ మీడియాలో క్లుప్తంగానే స్పందించినప్పటికీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. "యువరానర్... గౌరవప్రదంగా ఏదో ఒకటి చేయండి మీ 'గౌరవం' కోసం" అంటూ గౌరవం అనేపదాన్ని కాస్త ఎత్తిచూపుతూ ట్వీట్ చేశారు.
Anupam Kher
Supreme Court
Honour
Nupur Sharma
Prophet
BJP
India

More Telugu News