డియ‌ర్ హ‌ర్షా... గ‌ర్వంగా ఉంది!: కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌!

02-07-2022 Sat 18:56
  • పారిస్‌లో మాస్ట‌ర్స్ పూర్తి చేసిన హ‌ర్షిణి రెడ్డి
  • డిస్టింక్ష‌న్‌తో పాటు డీన్స్ జాబితాలో చోటు సాధించిన జ‌గ‌న్ కూతురు
  • కూతురు ప్ర‌తిభ‌ను కీర్తిస్తూ ట్వీట్ చేసిన జ‌గ‌న్‌
ys jagan tweet on his dauthers graduation ceremony
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీ పూర్తి చేయ‌డం పట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ శ‌నివారం సాయంత్రం సోష‌ల్ మీడియాలో ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్‌ను పోస్ట్ చేశారు. డియ‌ర్ హ‌ర్షా చాలా గ‌ర్వంగా ఉంది అంటూ ఆయ‌న స‌ద‌రు పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. నీవు ఎదిగిన తీరు అమిత సంతోషాన్నిచ్చింద‌ని కూడా జ‌గ‌న్ పేర్కొన్నారు. దేవుడు నీ ప‌ట్ల కృప చూపించాడ‌ని పేర్కొన్నారు. ఈ రోజు ఇన్‌సీడ్ నుంచి డిస్టింక్ష‌న్‌తో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేయ‌డం గర్వంగా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. డిస్టింక్ష‌న్‌తో పాటు డీన్స్ జాబితాలోనూ చోటు సంపాదించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

వైఎస్ హ‌ర్షిణి రెడ్డి పారిస్‌లోని ఇన్‌సీడ్ వ‌ర్సిటీలో మాస్ట‌ర్స్ డిగ్రీ పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. శ‌నివారం వ‌ర్సిటీలో జ‌రిగిన స్నాత‌కోత్స‌వంలో భాగంగా మాస్ట‌ర్స్ డిగ్రీ ప‌ట్టాను హ‌ర్షిణి అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు జ‌గ‌న్ దంప‌తులు పారిస్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ప‌ట్టా అందుకున్న కూతురుతో క‌లిసి జ‌గ‌న్ దంప‌తులు ఫొటో దిగారు. ఈ ఫొటోను జ‌గ‌న్ త‌న ట్వీట్‌కు జ‌త చేశారు.