ప్ర‌ధాని ఆవిష్క‌రించ‌నున్న అల్లూరి విగ్ర‌హం వ‌ద్ద మంత్రి రోజా!... ఫొటోలు ఇవిగో!

02-07-2022 Sat 18:26
  • ఈ నెల 4న భీమ‌వ‌రానికి రానున్న ప్ర‌ధాని మోదీ
  • అల్లూరి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్న వైనం
  • ప్ర‌ధాని కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రులు
ap minister rk roja inspects arrangements of modi bhimavaram programme
మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125 జ‌యంతిని పుర‌స్క‌రించుకుని భీమ‌వ‌రంలో ఈ నెల 4న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అల్లూరి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్న సంగ‌తి తెలిసిందే. 30 అడుగుల ఎత్తులో అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి కాగా...విగ్రహం కూడా సిద్ధ‌మైంది. 

ఈ ఏర్పాట్ల‌ను శ‌నివారం జిల్లాకు చెందిన మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావుతో క‌లిసి మంత్రి ఆర్కే రోజా ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అల్లూరి విగ్ర‌హం వ‌ద్ద నిలుచుని రోజా ఫొటోలు దిగారు. స‌ద‌రు ఫొటోల‌ను ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు.