Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సంచలన పోస్టర్ పై టాలీవుడ్ భామలు ఏమన్నారంటే...!

What Tollywood divas reacts to Vijay Devarakonda bold poster from Liger
  • విజయ్ దేవరకొండ హీరోగా లైగర్
  • పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిత్రం
  • తాజాగా విజయ్ పోస్టర్ విడుదల
  • బోల్డ్ గా ఉందంటున్న టాలీవుడ్ భామలు
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ చిత్రం నుంచి సంచలన పోస్టర్ విడుదలవడం తెలిసిందే. నగ్నంగా ఉన్న విజయ్ దేవరకొండ కొన్ని గులాబీలు పట్టుకుని ఉండడం ఆ పోస్టర్ లో చూడొచ్చు. ఈ పోస్టర్ పై టాలీవుడ్ ముద్దుగుమ్మలు స్పందించారు. సమంత స్పందిస్తూ... లైగర్ పోస్టర్ అదిరిపోయిందని వ్యాఖ్యానించింది. ఈ పోస్టర్ లో విజయ్ చాలా బోల్డ్ గా ఉన్నాడని, అలా కనిపించడానికి ధైర్యం కావాలని సమంత ప్రశంసించింది. విజయ్ కి రూల్స్ తెలుసని, వాటిని బ్రేక్ చేయగలడని పేర్కొంది. 

ఇక, మిల్కీ బ్యూటీ తమన్నా స్పందిస్తూ... చంపేశావ్ విజయ్ దేవరకొండ అంటూ అభినందించింది. లైగర్ విజయవంతం కావాలంటూ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ గుడ్ లక్ చెప్పింది. 

అనుష్క కూడా లైగర్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ చేరువ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. విజయ్ మరోసారి గ్రాండ్ సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొంది. ప్రతి చిత్రంతో విజయ్ తన ప్రత్యేకత చాటుకోవాలని అనుష్క వెల్లడించింది. ఇక, పూరీ జగన్నాథ్ మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్నామని, చార్మీ నిర్మాతగా మరిన్ని చిత్రాలు తీయాలని కోరుకుంటున్నట్టు అనుష్క సోషల్ మీడియా ద్వారా వివరించింది. అటు, లైగర్ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ధర్మ ప్రొడక్షన్స్ అధినేత, బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జోహార్ కు కూడా అనుష్క శుభాకాంక్షలు తెలిపింది.
Vijay Devarakonda
Poster
Liger
Samantha
Tamannaah
Anushka Shetty
Tollywood

More Telugu News