Telangana: తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు మ‌రో తీపి క‌బురు

ts government approves to fillup 1663 posts in various departments
  • 1,663 ఉద్యోగాల భ‌ర్తీకి ఆర్ధిక శాఖ అనుమ‌తి
  • ఇంజినీరింగ్ విభాగంలోనే 1,522 ఉద్యోగాలు
  • త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్న టీఎస్పీఎస్సీ
తెలంగాణ‌లో ఉద్యోగాల భ‌ర్తీకి వ‌రుస‌గా నోటిఫికేష‌న్‌లు విడుద‌లవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి త‌రుణంలో శ‌నివారం రాష్ట్ర ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు మ‌రో తీపి కబురు చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,663 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు అనుమ‌తిస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాల భ‌ర్తీ తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) ద్వారా జ‌ర‌గ‌నుంది.

ఆర్థిక శాఖ తాజాగా అనుమ‌తి మంజూరు చేసిన ఉద్యోగాల్లో... ఇంజినీరింగ్ విభాగంలో 1,522 పోస్టులు, భూగ‌ర్భ జల శాఖ‌లో 88 ఖాళీలు, డైరెక్ట‌ర్ ఆప్ వ‌ర్క్స్ అకౌంట్స్‌లో 53 ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాల‌కు ఆర్ధిక శాఖ నుంచి అనుమ‌తి ల‌భించిన నేపథ్యంలో త్వ‌ర‌లోనే టీఎస్పీఎస్సీ వీటి భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ ఇవ్వ‌నుంది.
Telangana
TSPSC
Job Notificatikon
TS Finance Department
KCR
TRS

More Telugu News