MS Dhoni: మోకాళ్ల నొప్పి నివార‌ణ చికిత్స‌కు ధోని పెట్టిన ఖ‌ర్చెంతో తెలుసా?

  • రాంచీకి 70 కిలో మీట‌ర్ల దూరంలో వంద‌న్ సింగ్ వైద్యం
  • చెట్టు కిందే కూర్చుని వైద్యం చేస్తున్న ఆయుర్వేద వైద్యుడు
  • ధోనీ వ‌ద్ద క‌న్స‌ల్టేష‌న్ ఫీజు కింద రూ.20 మాత్ర‌మే తీసుకున్న వైనం
  • మ‌రో రూ.20 విలువ చేసే మందుల‌ను రాసిచ్చిన వైద్యుడు
ms dhoni paid only 40rupees for his treatment at aayurvedic doctor

టీమిండియా మాజీ ఆట‌గాడు, కెప్టెన్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ త‌న మోకాళ్ల నొప్పుల‌కు ఓ ఆయుర్వేద వైద్యుడి వ‌ద్ద చికిత్స తీసుకుంటున్న‌ట్లుగా తెలిసిందే. త‌న సొంతూరు రాంచీకి 70 కిలో మీట‌ర్ల దూరంలో ఓ చెట్టు కింద కూర్చుని వైద్యం చేసే వంద‌న్ సింగ్ ఖేర్వార్ వ‌ద్ద చికిత్స తీసుకుంటున్నాడు. క్యాల్షియం లోపం కార‌ణంగా త‌లెత్తిన ఈ స‌మ‌స్య‌కు ఇత‌రత్రా వైద్య చికిత్స‌ల‌తో ఉప‌మ‌శ‌నం ల‌భించ‌క‌పోగా... త‌ల్లిదండ్రుల సూచ‌న మేర‌కు వంద‌న్ సింగ్ వ‌ద్ద‌కు ధోనీ వెళ్లాడ‌ట‌. ఈ క్ర‌మంలో ధోని ఎవ‌రో కూడా తెలియ‌కుండానే వంద‌న్ సింగ్ అత‌డికి చికిత్స చేశాడు. 

ప్ర‌స్తుతం ఈ చికిత్స ఇంకా కొన‌సాగుతోంద‌ట‌. అయితే త‌న‌కు చికిత్స అందించిన వంద‌న్ సింగ్‌కు ధోనీ ఎంత‌మేర ఫీజు చెల్లించార‌న్న విష‌యం తెలిస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. కేవ‌లం రూ.40 తీసుకుని ధోనికి వంద‌న్ సింగ్ వైద్యం చేశార‌ట‌. ఈ రూ.40లో కూడా క‌న్స‌ల్టేష‌న్ ఫీజు కింద రూ.20 మాత్ర‌మే తీసుకున్న వంద‌న్ సింగ్‌... మ‌రో రూ.20కి మందులు ఇచ్చార‌ట‌. అంటే... క‌న్స‌ల్టేష‌న్‌, మందులు రెండూ క‌లిపితే మొత్తం రూ.40 మాత్ర‌మే అయ్యింద‌న్న‌మాట‌. 

ఇదిలా ఉంటే... ధోనీ త‌ల్లిదండ్రుల‌కు కూడా గ‌డ‌చిన 3 నెల‌లుగా వంద‌న్ సింగే వైద్యం చేస్తున్నార‌ట‌. రాంచీ ప‌రిస‌రాల్లో వంద‌న్ సింగ్ ఆయుర్వేద వైద్యానికి మంచి పేరుంది. ఈ క్ర‌మంలో ఆయ‌న వ‌ద్ద చికిత్స తీసుకుని ఫ‌లితాలు చూసిన నేప‌థ్యంలో ధోని పేరెంట్స్ అత‌డిని కూడా ఆయ‌న వ‌ద్ద‌కు పంపార‌ట‌.

More Telugu News