ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు బోర్ కొడుతోందట!

02-07-2022 Sat 12:24
  • ట్విట్టర్ లో వరుస ట్వీట్లు వదిలిన టెస్లా అధినేత
  • నలుగురు కుమారులతో కలసి పోప్ తో భేటీ
  • మాజీ భార్యను కలుసుకున్న ఫొటో కూడా షేర్
Elon Musk is feeling bored and back on Twitter with a photo of the Pope
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తనకు కొంచెం బోర్ కొట్టినట్టు ఉందంటూ ట్వీట్ చేశారు. రెండు వారాల పాటు మౌనంగా ఉన్న ఆయన ఎట్టకేలకు స్పందించారు. శనివారం వరుసగా ట్వీట్లు చేశారు. 

‘‘పోప్ ను నిన్న కలుసుకోవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను’’ అంటూ పోప్ ఫ్రాన్సిస్ తో కలసి తీసుకున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. చిత్రంలో ఆయన నలుగురు కుమారులు కూడా ఉన్నారు. పోప్ ను ఎక్కడ కలుసుకున్నదీ వెల్లడించలేదు. మరో ట్వీట్ లో మాజీ భార్య రిలేతో వెనిస్ లో సన్నిహితంగా ఉన్న ఫొటోను మస్క్ పోస్ట్ చేశారు‘‘బహుశా కొంచెం బోర్ గా ఉన్నట్టుంది?’’అని మస్క్ పేర్కొన్నారు.

44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను కొనుగోలు చేయాలనుకున్న ఎలాన్ మస్క్.. కొన్ని అపరిష్కృత అంశాలు ఉన్నాయంటూ గత నెలలో ట్వీట్ చేశారు. ఆ తర్వాత నుంచి ఆయన మౌనం దాల్చారు.