Tyres: అక్టోబరు 1 నుంచి కార్లు, బస్సులకు కొత్త రకం టైర్లు!

  • ఆటోమోటివ్  ఇండస్ట్రీ స్టాండర్డ్స్ 142:2019’లో నిర్దేశించినట్టుగా కొత్త టైర్లు ఉండాలన్న కేంద్రం
  • టైర్లకు రోలింగ్ రిసిస్టెన్స్, వెట్ గ్రిప్, రోలింగ్ సౌండ్ ఎమిషన్ తప్పకుండా ఉండాలని సూచన
  • వీటి వల్ల ఇంధన వినియోగ సామర్థ్యం పెరుగుతుందన్న కేంద్రం
Tyres Need To Meet Standards From October

అక్టోబరు 1 నుంచి నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన కొత్త రకం టైర్లు రాబోతున్నాయి. కార్లు, ట్రక్కులు, బస్సులకు ఇకపై వాటినే వాడాలంటూ కేంద్ర రహదారి, రవాణాశాఖ నిర్దేశించింది. ఈ మేరకు నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ 142:2019’లో నిర్దేశించినట్టుగా ఇకపై కొత్త టైర్లుకు రోలింగ్ రెసిస్టెన్స్, వెట్ గ్రిప్, రోలింగ్ సౌండ్ ఎమిషన్ ఉండాలని కేంద్రం సూచించింది. వాహనం ప్రయాణిస్తున్నప్పుడు వాటి టైర్లు రోడ్డును పట్టుకుని (రోలింగ్ రెసిస్టెన్స్) ఉండాలని అలాగే, తడి రోడ్లపై జారిపోకుండా(వెట్ గ్రిప్), శబ్దం చేయకుండా (సౌండ్ ఎమిషన్) ఉండాలని పేర్కొంది.

ఈ నిబంధనల అమలుతో ‘యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ కమిషన్ ఫర్ యూరప్’ స్థాయి ప్రమాణాలను భారత్ కూడా అచరణలోకి తెచ్చినట్టు అవుతుందని వివరించింది. అంతేకాదు, ఈ మార్పుల వల్ల ఇంధన వినియోగ సామర్థ్యం పెరుగుతుందని, ప్రమాదాలు కూడా తగ్గుతాయని పేర్కొంది. ఇప్పటికే పాత డిజైన్‌లో తయారైన టైర్లను వచ్చే ఏడాది మార్చి 30 వరకు ఉపయోగించుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.

More Telugu News