Peedika Rajanna Dora: టీడీపీలో చేరితే రూ. 30 కోట్లు, మంత్రి పదవి అమరావతిలో ఇల్లు ఇస్తామన్నారు: డిప్యూటీ సీఎం రాజన్నదొర సంచలన వ్యాఖ్యలు

Peedika Rajanna Dora sensational Comments on TDP
  • విజయనగరంలో జిల్లా స్థాయి ప్లీనరీ
  • ఆ రోజు టీడీపీలోకి వెళ్లకపోవడం వల్లే నేడు మంచి పదవిలో ఉన్నానన్న రాజన్నదొర
  • తొలిసారి తనకు మంత్రి పదవి రాకపోయిన అసంతృప్తి చెందలేదని వ్యాఖ్య

రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తనను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. తాను వైసీపీని వీడి టీడీపీలో చేరితే రూ. 30 కోట్లు, మంత్రి పదవి, అమరావతిలో ఇల్లుతో పాటు తన పిల్లల చదువు బాధ్యతలు కూడా చూసుకుంటామని హామీ ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, జగన్‌పై నమ్మకం, అభిమానంతో తాను అందుకు అంగీకరించలేదన్నారు. నాడు టీడీపీలోకి వెళ్లకపోవడం వల్లే నేడు మంచి పదవిలో ఉన్నానని చెప్పుకొచ్చారు.

విజయనగరంలో నిన్న నిర్వహించిన జిల్లా స్థాయి ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మొదటి విడతలో తనకు మంత్రి పదవి రాకపోయినా తానేమీ అసంతృప్తి చెందలేదని అన్నారు. తనకు కాకుండా పుష్ఫ శ్రీవాణికి అవకాశం దక్కినా ఒక్క మాట కూడా అనలేదన్నారు. పత్రికలు, టీవీల్లో వస్తున్న వార్తల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిజానిజాలు నిర్ధారించుకోవాలని ప్రజలకు సూచించారు.

  • Loading...

More Telugu News