రమ్య నా పరువు తీసింది: నరేశ్ అంశంపై స్పందించిన పవిత్రా లోకేశ్

01-07-2022 Fri 22:07
  • వివాదం రూపుదాల్చిన నరేశ్, పవిత్ర లోకేశ్ వ్యవహారం
  • బెంగళూరులో రచ్చ చేసిన నరేశ్ భార్య రమ్య
  • తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పవ్రిత లోకేశ్
  • తనకు, నరేశ్ కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి
Pavitra Lokesh reacts to allegations made by Ramya
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, క్యారెక్టర్ నటి పవిత్రా లోకేశ్ మధ్య అనుబంధం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నరేశ్ భార్య రమ్య బెంగళూరులో ఈ అంశంపై రచ్చ చేయడంతో ఇది వివాదం రూపుదాల్చింది. దీనిపై పవిత్ర లోకేశ్ స్పందించారు. నరేశ్ భార్యనంటూ వచ్చిన రమ్య బెంగళూరులో మీడియాలో తనపై చాలా చెడుగా మాట్లాడిందని వెల్లడించారు. వాళ్ల కాపురంలో తాను చిచ్చుపెడుతున్నానంటూ లేనిపోని అభాండాలు వేసిందని పవిత్ర లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో తాను తీవ్ర మనస్తాపానికి గురవుతున్నానని తెలిపారు. 

నరేశ్ తెలుగులో పెద్ద యాక్టర్ అని, ఆయన భార్య గొడవ చేయాలనుకుంటే హైదరాబాదులో చేయాలని, బెంగళూరు ఎందుకు వచ్చినట్టు? అని ప్రశ్నించారు. ఈ అంశంలో తాను, నరేశ్ బాధితులం అయ్యామని, అందరూ తమకు మద్దతుగా నిలవాలని పవిత్ర లోకేశ్ విజ్ఞప్తి చేశారు.