ఇసుకేస్తే రాల‌నంత‌!.. రాహుల్ గాంధీ ర్యాలీలో భారీ జ‌న‌సందోహం!

01-07-2022 Fri 21:47
  •  వయనాడ్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన రాహుల్‌
  • ప‌ట్ట‌ణంలో భారీ ర్యాలీ నిర్వ‌హించిన పార్టీ
  • క‌నుచూపు మేర రోడ్డంతా జ‌నంతో నిండిపోయిన వైనం
huge crowd attends rahul gandhi rally in Wayanad
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ త‌న సొంత నియోజ‌క‌వర్గం కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో శుక్ర‌వారం నిర్వ‌హించిన ర్యాలీకి భారీ జ‌న సందోహం హాజ‌రైంది. వ‌య‌నాడ్‌లోని ప్ర‌ధాన ర‌హ‌దారిపై జ‌రిగిన ఈ ర్యాలీలో క‌నుచూపు మేర జ‌నంతో ఆ రోడ్డు నిండిపోయింది. ఇసుకేస్తే రాల‌నంత మంది హాజ‌ర‌య్యారు అన్న మాట‌కు ఈ ర్యాలీ అద్దం ప‌ట్టింది. ర్యాలీలో రాహుల్ గాంధీ ఎక్క‌డున్నారో కూడా క‌నిపించ‌క‌పోగా... ర్యాలీలో జ‌నం క‌దిలిన తీరు చీమ‌ల దండునే త‌ల‌పించింది.

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి వ‌య‌నాడ్‌కు శుక్ర‌వారం వ‌చ్చారు. అంతేకాకుండా వ‌య‌నాడ్‌లోని రాహుల్ కార్యాల‌యంపై కూడా ఇటీవ‌లే గుర్తు తెలియ‌ని దుండ‌గులు దాడికి దిగారు. ఈ నేప‌థ్యంలో రాహుల్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ ర్యాలీకి వ‌య‌నాడ్ ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లిరావ‌డం గ‌మ‌నార్హం.