తెలంగాణలో మరో 462 మందికి కరోనా

01-07-2022 Fri 21:25
  • గత 24 గంటల్లో 25,518 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 259 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 403 మంది
  • ఇంకా 4,702 మందికి చికిత్స
Telangana corona bulletin
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,518 కరోనా పరీక్షలు నిర్వహించగా, 462 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 259 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40, రంగారెడ్డి జిల్లాలో 35 కేసులు గుర్తించారు. అదే సమయంలో 403 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 8,01,406 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,92,593 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,702 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.