మ‌హిళ‌ల‌తో క‌లిసి కోలాటం ఆడిన బీజేపీ నేత‌... వీడియో ఇదిగో

01-07-2022 Fri 21:18
  • శ‌ని, ఆదివారాల్లో బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు
  • హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదిక‌గా స‌మావేశాలు
  • ఉత్సాహంగా క‌నిపిస్తున్న స‌మావేశాల వేదిక‌
  • కోలాటం ఆడిన సునీల్ దేవ్‌ధ‌ర్‌
bjp leader sunil deodhar participated in kolatam at hicc
బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌కు హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీ ముస్తాబైంది. శ‌ని, ఆదివారాల్లో జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశాల్లో పాలుపంచుకునేందుకు బీజేపీకి చెందిన కీల‌క నేత‌లంతా ఇప్ప‌టికే హైదరాబాద్ చేరుకున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర కేబినెట్‌లోని కీల‌క మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ వంటి న‌లుగురైదుగురు మాత్రమే ఇంకా రావాల్సి ఉంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కూడా శుక్ర‌వారం సాయంత్రానికే హైద‌రాబాద్ చేరుకున్నారు.

పార్టీకి చెందిన కీల‌క నేత‌లంతా హైద‌రాబాద్ చేరుకున్న నేప‌థ్యంలో న‌గ‌రంలో కాషాయ జెండాలు రెప‌రెప‌లాడుతున్నాయి. ఇక స‌మావేశాల వేదిక హెచ్ఐసీసీ వ‌ద్ద అయితే ఓ రేంజి సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ సంద‌ర్భంగా సంప్ర‌దాయ నృత్యకారుల‌ను ర‌ప్పించిన బీజేపీ నేత‌లు వారితో క‌లిసి కాలు క‌దుపుతూ ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జీగా వ్య‌వ‌హ‌రిస్తున్న సునీల్ దేవ్‌ధ‌ర్ అయితే కోలాటం ఆడే మ‌హిళ‌ల‌తో క‌లిసి తానూ కాలు క‌దిపారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.