చంద్ర‌బాబుతో సినీ న‌టుడు రాజ్ కుమార్ భేటీ... 2024లో టీడీపీదే విజ‌య‌మ‌ని ప్ర‌కట‌న‌

01-07-2022 Fri 20:09
  • మంగ‌ళగిరి పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన భేటీ
  • 1996 నుంచి టీడీపీ కోసం ప్ర‌చారం చేస్తున్నాన‌న్న న‌టుడు
  • చంద్ర‌బాబును మ‌ర్యాద‌పూర్వ‌కంగానే క‌లిశాన‌ని వెల్ల‌డి
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడిని తెలుగు సినీ న‌టుడు రాజ్ కుమార్ క‌లిశారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యానికి శుక్ర‌వారం వ‌చ్చిన రాజ్ కుమార్ టీడీపీ అధినేత‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రూ కాసేపు మాట్లాడుకున్నారు. అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన రాజ్ కుమార్ అక్క‌డే మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడారు.

2024 ఎన్నిక‌ల్లో టీడీపీదే విజ‌య‌మ‌ని రాజ్ కుమార్ తెలిపారు. 1996 నుంచి తాను టీడీపీ కోసం ప్ర‌చారం చేస్తున్నాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలోనే చంద్ర‌బాబుతో భేటీ అయ్యాన‌న్నారు. టీడీపీ అభిమానిగా చంద్ర‌బాబును మ‌ర్యాద‌పూర్వ‌కంగానే తాను క‌లిసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.