వైసీపీకి ఈద‌ర మోహ‌న్ బాబు రాజీనామా.. బాలినేని న‌మ్మ‌క ద్రోహ‌మే కార‌ణ‌మ‌ని ఆరోప‌ణ‌

01-07-2022 Fri 19:21
  • డీసీసీబీ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించిన ఈద‌ర‌
  • 2017లో టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మోహ‌న్ బాబు
  • 2018లో వైసీపీలో చేరిన వైనం
edara mohanbabu resigns ysrcp
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ప్ర‌కాశం జిల్లాలో మ‌రో షాక్ త‌గిలింది. జిల్లా స‌హ‌కార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మాజీ చైర్మ‌న్ ఈద‌ర మోహ‌న్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బాలినేని న‌మ్మ‌క ద్రోహం కార‌ణంగానే తాను పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. 

టీడీపీతోనే రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లుపెట్టిన ఈద‌ర మోహ‌న్ బాబు... టీడీపీ హయాంలోనే జిల్లా స‌హ‌కార కేంద్ర బ్యాంకుకు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. రాష్ట్రంలో 2017లో మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో టీడీపీకి రాజీనామా చేసిన ఈద‌ర‌... 2018లో వైసీపీలో చేరారు. తాజాగా వైసీపీ నేత‌ల వ్య‌వ‌హార ధోర‌ణి న‌చ్చ‌క ఆయ‌న వైసీపీకి కూడా రాజీనామా చేశారు.