పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణు .. 'అల్లూరి' ఫస్టులుక్ రిలీజ్!

01-07-2022 Fri 17:37
  • విభిన్నమైన పాత్రలు చేస్తూ వస్తున్న శ్రీవిష్ణు 
  • తాజా చిత్రంగా రూపొందుతున్న 'అల్లూరి'
  • దర్శకుడిగా ప్రదీప్ వర్మ పరిచయం 
  • సంగీతాన్ని సమకూర్చుతున్న హర్షవర్ధన్ రామేశ్వర్    
Alluri movie first look released
మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. తన ప్రతి సినిమా కొత్తగా ఉండేలా .. ప్రతి సినిమాలోనూ తాను కొత్తగా కనిపించేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాడు. కానీ ఈ మధ్య కాలంలో ఒక్క 'రాజ రాజ చోర' మాత్రమే ప్రేక్షకుల ఆదరణ పొందింది. 

ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రంగా 'అల్లూరి' రూపొందుతోంది. ఈ సినిమాలో ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. 'అతని పేరు అల్లూరి సీతారామరాజు .. అతను నిజాయతీకి మారుపేరు' అంటూ ఆ పాత్ర పేరును .. స్వభావాన్ని చెబుతూ ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. 

లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్ వ్యవహరిస్తున్నాడు. ఇంతవరకూ శ్రీవిష్ణు చేస్తూ వచ్చిన సినిమాలకి ఈ సినిమా పూర్తి భిన్నమనే విషయం తెలుస్తోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి..