Residential Schools: తెలంగాణలో కాలేజీలుగా మారనున్న 86 గురుకుల పాఠశాలలు

  • ముఖ్యమంత్రి ఆదేశాలతో అప్ గ్రేడ్ అవుతున్న గురుకుల పాఠశాలలు
  • ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించిన సీఎస్
  • నివేదిక పూర్తయిన తర్వాత సీఎం సమావేశంలో వీటిపై చర్చిస్తామన్న సీఎస్
86 government residential schools in TS upgrading to junior colleges

తెలంగాణలో 86 గురుకుల పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా మారనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వీటిని అప్ గ్రేడ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మార్గదర్శకాల రూపకల్పనపై సీఎస్ సోమేశ్ కుమార్ వివిధ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ల ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సోమేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను జిల్లాకు ఒకటి చొప్పున శాశ్వతంగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. నివేదికలు సిద్ధమైన తర్వాత ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో వీటిపై చర్చిస్తామని తెలిపారు.

More Telugu News