రేపు హైదరాబాద్ కు వస్తున్న యశ్వంత్ సిన్హా.. స్వాగతం పలకనున్న కేసీఆర్

01-07-2022 Fri 17:18
  • విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
  • జలవిహార్ లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
  • సిన్హాకు విందు ఇవ్వనున్న కేసీఆర్
KCR to welcome Yashwant Sinha
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా రేపు హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారని చెప్పారు. ఆ తర్వాత నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ కు చేరుకుంటారని... అక్కడ కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ఉంటుందని చెప్పారు. అనంతరం సిన్హా, కేసీఆర్ ఇద్దరూ అక్కడే భోజనం చేస్తారని తెలిపారు. 

మహారాష్ట్ర, కర్ణాటక, గోవాలో ఏమైందో ప్రజలు గమనిస్తున్నారని... అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ కుట్రలు ఫలించవని అన్నారు. హైదరాబాదుకు వస్తున్న బీజేపీ టూరిస్టులు హైదరాబాద్ అందాలతో పాటు అభివృద్ధిని కూడా చూడాలని చెప్పారు. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషంచబోతోందని అన్నారు.