బహిరంగసభ తర్వాత ప్రధాని మోదీ బస చేసేది ఇక్కడే: పోలీస్ కమిషనర్ ఆనంద్

01-07-2022 Fri 17:01
  • ఈ నెల 3న పరేడ్ గ్రౌండ్స్ లో మోదీ బహిరంగ సభ
  • సభకు హాజరవుతున్న బీజేపీ కేంద్ర మంత్రులు, సీఎంలు
  • సభ తర్వాత రాజ్ భవన్ లో బస చేయనున్న ప్రధాని
Modi is going to stay in Raj Bhavan
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఆయన వస్తున్నారు. ఈ నెల 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మోదీ బహిరంగ సభ జరగనుంది. బహిరంగ సభ తర్వాత రాజ్ భవన్ లో మోదీ బస చేస్తారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 

ప్రధాని బస సందర్భంగా భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. హెచ్ఐసీసీ, బేగంపేట్, రాజ్ భవన్ మార్గాల్లో 4 వేల మంది పోలీసులతో పహారా నిర్వహిస్తామని తెలిపారు. పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో 3 వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు సభకు హాజరవుతున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను ఇంఛార్జ్ లుగా నియమించామని చెప్పారు.