Anantababu: ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో 15 రోజుల రిమాండ్

  • డ్రైవర్ హత్యకేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు
  • మే 23 నుంచి జైలులో ఉన్న వైనం
  • రెండుసార్లు బెయిల్ పిటిషన్ కొట్టివేత
  • నేడు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
Remand extended for MLC Ananatababu

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. అనంతబాబు రిమాండ్ నేటితో ముగియగా, పోలీసులు అతడిని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న పిమ్మట కోర్టు అనంతబాబుకు మరో 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది. గత మే నెల 23వ తేదీ నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న అనంతబాబు రెండుసార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా, కోర్టు తిరస్కరించింది. 

కాగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో కాకినాడ పోలీసుల విచారణ సరిగాలేదంటూ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర (ఏపీసీఎల్ఏ) మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. ఏపీసీఎల్ఏ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సుబ్రహ్మణ్యం హత్యకేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని హెచ్చార్సీ దృష్టికి తీసుకెళ్లినట్టు ముప్పాళ్ల సుబ్బారావు వివరించారు.

More Telugu News