Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రాకు అమ్మ నుంచి బోలెడు టిప్స్.. వెల్లడించిన భార్య!

Jasprit Bumrah wife Sanjana Ganesan reveals reaction of pacers mother after India name him captain for England Test
  • క్రికెట్ ఆడకపోయినా టన్నుల కొద్దీ టిప్స్ ఉండేవన్న సంజన
  • కొడుకు గొప్పగా ఆడాలని కోరుకుంటారని వెల్లడి
  • కెప్టెన్ వార్త విని ఎంతో సంతోషిస్తున్నట్టు చెప్పిన బుమ్రా భార్య
కొడుకు ఎంత ఎదిగినా.. అమ్మకు చిన్నగా కనిపిస్తాడు. భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా అంతే. బుమ్రాకు ఎన్నో టిప్స్ ఇచ్చే వాళ్లమ్మ.. ఇప్పుడు తన కుమారుడు టీమిండియా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వార్తను చూసి తెగ ఆనందపడిపోతోంది. ఈ విషయాన్ని బుమ్రా జీవిత భాగస్వామి సంజన గణేశన్ తెలిపారు. సంజన ఐసీసీ ప్రెజెంటర్ గా పనిచేస్తున్నారు. టీవీ ప్రెజెంటర్ కూడా. 

ఇంగ్లండ్ తో ఐదో టెస్ట్ లో భారత జట్టును సారథిగా బుమ్రా నడపిస్తుండడం పట్ల అతడి తల్లి దల్జీత్ ఎలా స్పందించిందో సంజన వెల్లడించారు. ‘‘ఎంతో ఆనందం, ఉద్వేగానికి లోనయ్యారు. అనుకూల, ప్రతికూలతల మధ్య అతడు ఎలా ఎదిగాడో ఆవిడ స్వయంగా చూశారు. బుమ్రా ఎప్పుడూ గొప్పగా ఆడాలని కోరుకుంటారు. 

ఆమె (దల్జీత్) ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు. అయినా ఆవిడ దగ్గర టన్నుల కొద్దీ టిప్స్, ట్రిక్స్ ఉండేవి. ఇలా ఆలోచించాలి. ఇలా చేయాలి అని చెప్పే వారు. కొడుకు గురించి ఆమె సంతోషంగా, గర్వంగా వుండడం చూస్తుంటే చాలా ఆనందంగా వుంది’’ అని సంజన వివరించారు. బుమ్రా సైతం గర్వంగా, సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. కపిల్ దేవ్ తర్వాత భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న రెండో బౌలర్ బుమ్రాయే కావడం గమనార్హం.
Jasprit Bumrah
wife
Sanjana Ganesan
mother
daljit
reaction

More Telugu News