భారత్ లో అమ్ముడుపోతున్న టాప్-10 విస్కీ బ్రాండ్లు ఇవే

  • దాదాపు సగం యునైటెడ్ స్పిరిట్స్ కు చెందినవే
  • ఆ తర్వాత పెర్నార్డ్ రికార్డ్ కు చెందిన మూడు బ్రాండ్లు
  • నంబర్ 1 స్థానంలో మెక్ డొవెల్స్ విస్కీ
Top 10 best selling Indian whisky brands

మద్యం అమ్మకాలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. నేటి జీవనశైలి చలన రహితంగా మారుతున్న క్రమంలో.. మద్యం వంటి అలవాట్లు గుండెకు ముప్పు తెచ్చి పెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో విస్కీ బ్రాండ్లు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో గతేడాది అత్యధికంగా అమ్ముడుపోయిన బ్రాండ్లను పరిశీలిస్తే..

మెక్ డొవెల్స్ నం1 విస్కీ
ఈ బ్రాండ్ యజమాని యునైటెడ్ స్పిరిట్స్. వరుసగా మూడో ఏడాది మొదటి స్థానాన్ని దక్కించుకుంది. యునైటెడ్ స్పిరిట్స్ డైజియా ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ. 2020లో 25.7 మిలియన్ కేసులను విక్రయించగా, 2021లో ఈ బ్రాండ్ 30.1 మిలియన్ కేసుల అమ్మకాలను నమోదు చేసుకుంది.

ఇంపీరియల్ బ్లూ
ఇంపీరియల్ బ్లూ గతంలో అత్యధిక విక్రయాల రికార్డును నమోదు చేసిన బ్రాండ్. కాకపోతే 2020లో అమ్మకాలు పడిపోయాయి. అంతకుముందు సంవత్సరాల్లో నమోదు చేసిన గరిష్ఠ విక్రయాల రికార్డును తిరిగి చేరుకోలేకపోతోంది. 2020లో 21.3 మిలియన్ కేసులను విక్రయించగా, 2021లో 24.1 మిలియన్ కేసులు అమ్ముడయ్యాయి. 

ఆఫీసర్స్ చాయిస్
ఆఫీసర్స్ చాయిస్ బ్రాండ్ విస్కీ అమ్మకాలు సైతం కరోనాకు ముందు నాటి రికార్డులను చేరుకోలేకపోతున్నాయి. అంతకుముందు 30 మిలియన్ కంటే ఎక్కువ కేసులు అమ్ముడుపోగా, 2020లో 20.8 మిలియన్ కేసులకు తగ్గిపోయాయి. 2021లో అమ్మకాలు 23.2 మిలియన్ కేసులుగా ఉన్నాయి.

రాయల్ స్టాగ్
పెర్నాడ్ రికార్డ్ బ్రాండ్ అయిన రాయల్ స్టాగ్ కరోనా ముందు నాటి రికార్డులను దాటిపోయింది. 2020లో 18.5 మిలియన్ కేసులను సంస్థ విక్రయించగా, 2021లో 22.4 మిలియన్ కేసులకు అమ్మకాలు పెరిగాయి.

హేవార్డ్స్
ఇన్ బ్రూ బెవరేజెస్ కు చెందిన ఈ బ్రాండ్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. 2020లో 9.7 మిలియన్ కేసులు అమ్ముడుపోతే, 2021లో 12 మిలియన్ కేసులకు విక్రయాలు వృద్ధి చెందాయి.

8 పీఎం
ర్యాడికో ఖైతాన్ కు చెందిన బ్రాండ్ ఇది. 2020లో 9.4 మిలియన్ కేసుల అమ్మకాలు నమోదు కాగా, 2021లో 11.4 మిలియన్ కేసులు అమ్ముడుపోయాయి.

బ్లెండర్స్ ప్రైడ్
టాప్ 10 విస్కీ బ్రాండ్లలో పెర్నాడ్ రికార్డ్ కు చెందిన రెండో బ్రాండ్ ఇది. ఈ బ్రాండ్ చాలా వేగంగా భారత్ లో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. 2020లో 6.6 మిలియన్ కేసులు, 2021లో 8 మిలియన్ కేసుల చొప్పున విక్రయాలు నమోదు చేసింది.

బ్యాగ్ పైపర్
ఇది కూడా యునైటెడ్ స్పిరిట్స్ కు చెందిన బ్రాండ్. 2020లో 5.3 మిలియన్ కేసులు అమ్ముడుపోతే, 2021లో 5.6 మిలియన్ కేసులకు విక్రయాలు పెరిగాయి. 

రాయల్ చాలెంజ్
విక్రయాల పరంగా తొమ్మిదో స్థానంలో ఉన్న బ్రాండ్ ఇది. 2020లో 4.3 మిలియన్ కేసుల విక్రయాలు నమోదు కాగా, 2021లో 4.7 మిలియన్ కేసులు అమ్ముడయ్యాయి. 

ఓల్డ్ టావెర్న్
యునైటెడ్ స్పిరిట్స్ కు చెందిన ఈ బ్రాండ్ 2020లో 4.5 మిలియన్ కేసులు, 2021లో 4.4 మిలియన్ కేసుల చొప్పున అమ్మకాలను నమోదు చేసింది. ఇక్కడ టాప్-10 విస్కీ బ్రాండ్లలో సగం యునైటెడ్ స్పిరిట్స్ కు చెందినవే ఉన్నాయి.

More Telugu News