congo: కాంగోలో మిలిటెంట్ల అరాచకం.. నిర్బంధంలోని వారికి మానవ మాంసం వడ్డింపు!

Kidnapped woman forced to cook eat human flesh in Congo rights group tells UN
  • ఓ మహిళను అపహరించిన రెండు మిలిటెంట్ గ్రూపులు
  • ఆమెపై పదే పదే అత్యాచారం
  • మానవ మాంసాన్ని వండించిన తీవ్రవాదులు
  • తమ నిర్బంధంలో ఉన్న వారికి తినిపించిన వైనం
కాంగోలో మిలిటెంట్ గ్రూపులు అత్యంత దారుణ చర్యలకు పాల్పడుతున్నాయి. ఓ మహిళ ద్వారా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఈ విషయాలు తెలిశాయి. మహిళా హక్కుల కోసం పోరాడే ఓ సంస్థ (సోఫ్ ప్యాడి) ప్రెసిడెంట్ జులియెన్నే లుసెంజే.. కాంగోలో ఓ మహిళ ఎదుర్కొన్న దారుణ అనుభవాన్ని 15 సభ్యులు గల భద్రతా మండలికి తెలియజేసింది. 

కాంగోలోని పరిస్థితులపై  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చర్చిస్తున్న సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అక్కడ సర్కారు, మిలిటెంట్ల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉండడం గమనార్హం. ఒక మహిళను రెండు మిలిటెంట్ గ్రూపులు కిడ్నాప్ చేసి ఎన్నో పర్యాయాలు అత్యాచారం చేయడమే కాకుండా, ఆమెతో మానవ మాంసాన్ని వండించినట్టు భద్రతా మండలికి హక్కుల సంస్థ ప్రెసిడెంట్ వివరించారు.

ఒక మహిళ తన కుటుంబ సభ్యుడు అపహరణకు గురి కావడంతో పరిహారం చెల్లించి విడిపించుకునేందుకు వెళుతుండగా, కొడెకో అనే మిలిటెంట్ గ్రూపు ఆమెను అపహరించుకుపోయింది. ఆమెపై ఒకరి తర్వాత ఒకరు ఎన్నో సార్లు అత్యాచారం చేశారు. భౌతికంగా గాయపరిచారు. తీవ్రవాదులు ఓ వ్యక్తి గొంతు కోసిన తర్వాత అతడి మాంసాన్ని వండాలంటూ సదరు మహిళను ఆదేశించారు. తమ నిర్బంధంలో ఉన్న వారికి ఆ మాంసం వడ్డించారు.  

కొన్ని రోజుల తర్వాత బాధిత మహిళను మిలిటెంట్లు వదిలేయగా, ఆమె ఇంటికి వెళుతున్న క్రమంలో మరో మిలిటెంట్ గ్రూపు ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేసింది. అక్కడ కూడా ఆమెతో మానవ మాంసం వండించి, ఆమెతోనే తినిపించారు. వారి చెర నుంచి కూడా ఆమె తప్పించుకు వచ్చి.. హక్కుల సంస్థకు జరిగింది వివరించింది.
congo
militants
human flesh
cook
women kidnapped
raped
UN security counsel

More Telugu News