Kishan Reddy: అల్లూరి జ‌యంతి వేడుక‌ల‌కు రండి!... చంద్ర‌బాబుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం!

kishan reddy invires chandrababu to alluri jayanthu celebrations
  • జులై 4న అల్లూరి 125 జ‌యంతి వేడుక‌లు
  • భీమ‌వరంలో అల్లూరి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్న ప్ర‌ధాని
  • ఇప్ప‌టికే చిరంజీవికి ఆహ్వానం పంపిన కిష‌న్ రెడ్డి 
జులై 4న భీమ‌వరంలో జ‌ర‌గ‌నున్న మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి వేడుక‌ల‌కు హాజ‌రు కావాలంటూ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుకు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఈ మేర‌కు గురువారం కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి... చంద్ర‌బాబుకు ఆహ్వానం పంపారు. 

అల్లూరి జ‌యంతి వేడుక‌ల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ హాజ‌ర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌యంతి వేడుక‌ల్లో భాగంగా భీమ‌వ‌రంలో అల్లూరి విగ్ర‌హాన్ని ప్ర‌ధాని ఆవిష్కరించ‌నున్నారు. అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నున్న ఈ కార్యక్ర‌మానికి రావాలంటూ ఇప్ప‌టికే టాలీవుడ్ అగ్ర హీరో, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి కూడా కిష‌న్ రెడ్డి ఆహ్వానం ప‌లికిన సంగ‌తి తెలిసిందే. తాజాగా చంద్ర‌బాబునూ ఆహ్వానిస్తూ కిష‌న్ రెడ్డి ఆహ్వానం పంపడం గ‌మ‌నార్హం.
Kishan Reddy
BJP
Chandrababu
TDP
Alluri seetharama raju
Prime Minister
Narendra Modi
Bhimavaram

More Telugu News