గీతా ఆర్ట్స్ 2 లో మొదలైన కొత్త సినిమా!

30-06-2022 Thu 12:25
  • గీతా ఆర్ట్స్ 2 నుంచి మరో ప్రాజెక్టు 
  • పూజా కార్యక్రమాలు జరుపుకున్న సినిమా
  • దర్శకుడిగా తేజ మర్ని 
  • కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్  
Srikanth in Teja Marni Movie
గీతా ఆర్ట్స్ పై పెద్ద సినిమాలను నిర్మించే అల్లు అరవింద్, ఓ మాదిరి బడ్జెట్ సినిమాలు చేయడానికి గీతా ఆర్ట్స్ 2 ను స్థాపించారు. ఈ బ్యానర్ పై వచ్చే సినిమాల వ్యవహారాలన్నీ బన్నీ వాసు చూసుకుంటూ ఉంటాడు. ఈ బ్యానర్ పై ఒకదాని తరువాత ఒక సినిమాను నిర్మిస్తూ వస్తున్నారు.

గోపీచంద్ తో నిర్మించిన 'పక్కా కమర్షియల్' సినిమా రేపు విడుదలవుతూ ఉండగానే, ఈ రోజున గీతా ఆర్ట్స్ 2 పై మరో ప్రాజెక్టును లాంచ్ చేశారు. కొంతసేపటి క్రితం హైదారాబాద్ - ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. దర్శక నిర్మాతలతో పాటు, ఈ సినిమాలో నటిస్తున్న హీరో శ్రీకాంత్ .. రాహుల్ విజయ్ .. శివాని రాజశేఖర్ పాల్గొన్నారు.

 గీతా ఆర్ట్స్ 2 నుంచి నిర్మితమవుతున్న 8వ సినిమా ఇది. 'అర్జున - ఫల్గుణ' దర్శకుడు తేజ మర్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సంగీత దర్శకుడిగా శక్తికాంత్ కార్తీక్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించనుండటం విశేషం. ముఖ్యమైన పాత్రలో మురళీశర్మ కనిపించనున్నాడు.