బాలకృష్ణ సినిమాలో ఫారిన్ ఫైట్ హైలైట్ అట!

30-06-2022 Thu 10:54
  • షూటింగు దశలో బాలకృష్ణ 107వ సినిమా
  • మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో సాగే కథ 
  • కథానాయికగా అలరించనున్న శ్రుతి హాసన్ 
  • ప్రతినాయకుడిగా కనిపించనున్న దునియా విజయ్  
Balakrishna and Gopichand Malineni movie update
బాలకృష్ణ 107వ సినిమా సెట్స్ పై ఉంది. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి, తమన్ స్వరాలను సమకూర్చుతున్నాడు. ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టు పోస్టర్ చూస్తేనే, ఈ సినిమాలో యాక్షన్ పాళ్లు ఏ రేంజ్ లో ఉన్నాయనేది అర్థమవుతోంది.

గోపీచంద్ మలినేని ఇంతకుముందు చేసిన 'క్రాక్' సినిమా చూస్తేనే, ఆయన ఏ రేంజ్ లో ఫైట్స్ కంపోజ్ చేయిస్తాడనేది అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఫైట్స్ హైలైట్ అనేలా ఆయన చూస్తున్నాడట. ఫస్టాఫ్ లో వచ్చే ఫారిన్ ఫైట్ ఆడియన్స్ ను ఆశ్చర్యచకితులను చేసేలా ఉంటుందని అంటున్నారు. 

అలాగే సెకండాఫ్ లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా ఇంతకుముందు బాలకృష్ణ సినిమాల్లో చూడని విధంగా డిజైన్ చేయించినట్టుగా చెబుతున్నారు. బాలకృష్ణ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తుండటంతో, ఆ పాత్రల మధ్య వైవిధ్యం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక విలన్ గా దునియా విజయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.