'కార్తికేయ 2'పై క్రేజ్ మామూలుగా లేదే!

30-06-2022 Thu 10:30
  • చందూ మొండేటి నుంచి 'కార్తికేయ 2' రెడీ 
  • నిఖిల్ తో జోడీ కట్టిన అనుపమ పరమేశ్వరన్ 
  • అప్ డేట్స్ కారణంగా పెరుగుతూ వచ్చిన అంచనాలు 
  • జులై 22వ తేదీన 5 భాషల్లో విడుదల 
Karthikeya 2 movie update
నిఖిల్ - చందూ మొండేటి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'కార్తికేయ' భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'కార్తికేయ 2' చేశారు. అభిషేక్ అగర్వాల్ - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటించింది.

'కార్తికేయ' కథ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం చుట్టూ తిరిగితే, 'కార్తికేయ 2' కథ ద్వాపరయుగానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరుగుతుంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ మరింతగా ఉత్కంఠను పెంచాయి. ఈ సినిమాపై అంచనాలకి తగినట్టుగానే బిజినెస్ జరిగినట్టుగా చెబుతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 5 భాషల్లో విడుదల చేయనున్నారు. మొత్తం థియేట్రికల్ హక్కులు ..  శాటిలైట్ .. డిజిటల్ .. ఆడియో హక్కులన్నీ కలుపుకుని, 34 కోట్లకు అమ్ముడైనట్టుగా చెబుతున్నారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను జులై 22వ తేదీన విడుదల చేయనున్నారు.