అనారోగ్యంతో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ భరోసా.. వీడియో ఇదిగో!

30-06-2022 Thu 09:56
  • అనారోగ్యంతో బాధ పడుతున్న జనార్దన్ అనే అభిమాని
  • తన అభిమాన హీరోతో మాట్లాడాలనుకున్న వైనం
  • విషయాన్ని ఎన్టీఆర్ కు చేరవేసిన అభిమాన సంఘం నేతలు
  • ఫోన్ ద్వారా మాట్లాడి భరోసా కల్పించిన తారక్
Junior NTR speaks to unhealthy fan
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ఎప్పుడూ అండగా ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడానికి అన్నివేళలా సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే ఎంతో మందికి అండగా నిలిచి రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు. తాజాగా అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జనార్దన్ అనే అభిమానికి అలాగే ధైర్యాన్ని నూరిపోశాడు. 

ఆయనతోను, ఆయన తల్లితోను ఫోన్ ద్వారా మాట్లాడి వారికి భరోసాను కల్పించారు. అధైర్య పడొద్దని, దేవుడి మీద భారం వేయాలని అన్నారు. దేవుడిని నమ్మాలని... త్వరలోనే జనార్దన్ కోలుకుని వస్తాడని ఆయన తల్లికి ధైర్యం చెప్పారు. అనారోగ్యంతో ఉన్న జనార్దన్ తన అభిమాన హీరో ఎన్టీఆర్ తో మాట్లాడాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో, ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు ఈ విషయాన్ని ఆయనకు చేరవేశారు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జనార్దన్, అతని తల్లితో ఎన్టీఆర్ ఫోన్ ద్వారా మాట్లాడారు.