హైదరాబాద్ కలెక్టర్ గా అమయ్ కుమార్

30-06-2022 Thu 09:12
  • ఈ రోజు ఉద్యోగ విరమణ పొందుతున్న హైదరాబాద్ కలెక్టర్ శర్మన్
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కు అదనపు బాధ్యతలు
  • నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
Amay Kumar appointed as Hyderabad district collector
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా అమయ్ కుమార్ నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న ఆయనకు హైదరాబాద్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు. అమయ్ కుమార్ నియామకానికి సంబంధించి నిన్న రాత్రి తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 

హైదరాబాద్ జిల్లా ప్రస్తుత కలెక్టర్ ఎల్.శర్మన్ ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ గా అమయ్ కుమార్ కు అదనపు బాధ్యతలను అప్పగించారు. మరొకరికి పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించేంత వరకు అమయ్ కుమార్ ఈ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తారు.