Sri Satyasai Dist: ఆటోపై తెగిపడిన హైటెన్షన్ వైరు.. శ్రీ సత్యసాయి జిల్లాలో ఐదుగురు మహిళా కూలీల సజీవ దహనం

five women charred to death in Sri Satya Sai dist
  • బాధితులు గుండంపల్లికి చెందినవారు
  • పొలం పనులకు ఆటోలో వెళ్తుండగా ఘటన
  • మరో మహిళ పరిస్థితి విషమం

కూలీలతో వెళ్తున్న ఆటోపై హై టెన్షన్ విద్యుత్ వైరు తెగిపడడంతో ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిందీ విషాద ఘటన. తాడిమర్రి మండలం గుండంపల్లికి చెందిన ఆరుగురు మహిళా కూలీలు పొలం పనుల కోసం చిల్లకొండయ్యపల్లికి ట్రాలీ ఆటోలో బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక వారి ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైరు తెగిపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ అకస్మాత్తు ఘటన నుంచి తప్పించుకునే మార్గమే లేకుండా పోయింది. ఆరుగురిలో ఐదుగురు సజీవ దహనం కాగా, లక్ష్మి అనే మహిళ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడింది. ధర్మవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News