ఆటోపై తెగిపడిన హైటెన్షన్ వైరు.. శ్రీ సత్యసాయి జిల్లాలో ఐదుగురు మహిళా కూలీల సజీవ దహనం
- బాధితులు గుండంపల్లికి చెందినవారు
- పొలం పనులకు ఆటోలో వెళ్తుండగా ఘటన
- మరో మహిళ పరిస్థితి విషమం
ఈ అకస్మాత్తు ఘటన నుంచి తప్పించుకునే మార్గమే లేకుండా పోయింది. ఆరుగురిలో ఐదుగురు సజీవ దహనం కాగా, లక్ష్మి అనే మహిళ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడింది. ధర్మవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.