వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుంటే రాష్ట్రం అధోగతి పాలే: సి.రామచంద్రయ్య

30-06-2022 Thu 08:43
  • రాయచోటిలో వైసీపీ ప్లీనరీ సమావేశం
  • వచ్చే ఎన్నికల్లో పోలింగ్ రోజున పెద్ద యుద్ధం జరుగుతుందని వ్యాఖ్య
  • వైసీపీ అధికారంలోకి రావడం అంత సులభమేమీ కాదన్న ఎమ్మెల్సీ
YCP MLC Ramachandraiah comments on own government
వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుంటే రాష్ట్రం అధోగతి పాలవడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిన్న జరిగిన వైసీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

వచ్చే ఎన్నికల్లో పోలింగ్ రోజున పెద్ద యుద్ధమే జరుగుతుందని, పార్టీ గెలవడం అంత సులభమేమీ కాదని అన్నారు. నాయకులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేదన్న రామచంద్రయ్య.. రాష్ట్రంలో ప్రజలు ఎక్కువయ్యారని, వారి కోరికలు వారిలాగే పెరుగుతున్నాయని అన్నారు. కాబట్టి వాటిని ఎవరూ తీర్చలేరని  అన్నారు.